రాజధాని అమరావతే ఉంటుందా? : జగన్ ఉచ్చులో టీడీపీ, బీజేపీ పడిందా

579

రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండొచ్చేమో అని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. ఉంటుంది అని మాత్రం అనలేదు. జీఎన్ రావు కమిటీ నివేదిక తర్వాత కేబినెట్ లో చర్చించి నిర్ణయం అన్నారు. అమరావతిపై సంచలన ప్రకటనను కూడా డైలమాలో పెట్టి చేయటం వెనక వ్యూహాత్మక వైఖరి ఉందా.. రాజధాని అమరావతిగానే ఉండబోతున్నదా.. సీఎం జగన్ మరో 15 రోజుల్లో స్వయంగా ప్రకటన చేయబోతున్నారా.. అనుకున్నదాని కంటే ఎక్కువగానే అమరావతి డెవలప్ మెంట్ కు శ్రీకారం చుడుతూ గ్రౌండ్ లోకి దిగబోతున్నారా.. అసలు ఏం జరగబోతున్నది.. సీఎం జగన్ వ్యూహాత్మక ఎత్తుగడపై ఇన్నర్ టాక్

ఒక్క దెబ్బకు పిట్టలన్నీ రాలాలి అంటే ఏం చేయాలని గన్ తో పేలిస్తే సరిపోతుందా.. సరిపోదు కదా. పెద్ద బాంబు వేయాలి. రాజకీయం అనే బాంబ్ ను అమరావతిపై వేశారు జగన్. ఇన్నర్ టాక్ లోని అంశాలను పాయింట్ టూ పాయింట్ తెలుసుకుందాం.
> రాజధాని అమరావతిగానే ఉంటుంది. అసెంబ్లీ, సెక్రటేరియట్ కూడా అక్కడే ఉంటుంది.
> వైజాగ్ లో వేసవికాలం సెషన్స్ జరుగుతాయి. టూరిజం, ఫిషరీస్ లాంటి కొన్ని శాఖలను విశాఖ కేంద్రంగా నడుస్తాయి.
> హైకోర్టును మాత్రం కర్నూలు తరలిస్తారు. దీనికి టీడీపీ నుంచి అభ్యంతరం రాదు. హైకోర్టు వల్ల జిరాక్స్ మెషీన్స్ మాత్రమే వస్తాయన్న రైతుల భావనను నిజం చేస్తారు. సో.. వాళ్ల నుంచి వ్యతిరేకత రాదు.
> ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ హబ్ గా అమరావతిని డిసైడ్ చేస్తూ వరసగా శంకుస్థాపనలు చేస్తారు.
> అమరావతి, విశాఖలో హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేస్తారు.
> గవర్నర్ రాజ్ భవన్ అమరావతిలో కాకుండా విశాఖలో ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటారు
> అమరావతి కేంద్రంగా ఉన్న ఐటీ రంగాన్ని విశాఖ కేంద్రంగా అభివృద్ధికి ప్రకటన చేస్తారు.
> అమరావతి రాజధాని కాకపోతే ఇక్కడ ఇల్లు ఎందుకు కట్టుకుంటాను.. చంద్రబాబుకే ఆ ఉద్దేశం లేదు కాబట్టి హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నాడు అని అంటారు.

మరో 15 రోజుల్లో ఈ ప్రకటన చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ప్రకటన చేయటానికి ఎందుకు ఇంత గందరగోళం అంటే పార్టీల స్టాండ్, రాజధాని రైతుల వెర్షన్, మిగతా ప్రాంతాల్లో ఉన్న అభిప్రాయాలు తీసుకోవటానికే అంటున్నారు.

సీఎం జగన్ ఈ ప్రకటన చేసిన తర్వాత అమరావతి రైతులు వ్యతిరేకించటానికి ఏమీ ఉండదు. సీఎం జగన్ కూడా అమరావతిలో ఉంటారు కనుక టీడీపీకి కౌంటర్ ఉండదు. దీనికితోడు మిగతా రైతుల విషయంలో అమరావతి రైతుల వైఖరి ఎలా ఉంటుంది.. వాళ్లు ఎలాంటి వాళ్లు అనే విషయాన్ని రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల ప్రజలకు స్పష్టంగా చెప్పినట్లు అవుతుంది.

టీడీపీ, బీజేపీతోపాటు ఒక్క సామాజిక వర్గం ఏ విధంగా వ్యవహరించిందో స్పష్టంగా చూశారు కదా అంటూ అసెంబ్లీలోనే బైట్స్ వేసి ఏకిపారేస్తాడు. మూడు రాజధానులు ఉండొచ్చేమో అని ప్రకటన చేస్తేనే ఇలా చేశారు.. కుట్రలు ఎలా జరుగుతున్నాయో అంటూ మిగతా ప్రాంతాల్లో టీడీపీ, బీజేపీ పార్టీలను భూస్థాపితం చేయొచ్చు.

ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల గుండెళ్లో టీడీపీ, బీజేపీ వ్యతిరేకతను బలంగా వేస్తారు. ఆ తర్వాత ఉత్తరాంధ్ర, సీమ ప్రాంతాల్లో టీడీపీ, బీజేపీ నేతలు పర్యటించటానికి, క్యాడర్ పెంచుకోవటానికి ఛాన్స్ లేకుండా చేస్తారు.

ఇక అమరావతి అంటారా.. ఇన్ని వరాలు ఇచ్చిన తర్వాత ఆ నాలుగు నియోజకవర్గాలు తప్పితే.. మిగతా వాళ్లు అందరూ హ్యాపీనే. ఓ సామాజిక వర్గం వ్యతిరేకం కావొచ్చు.. మిగతా అందరూ ఒక్కటి అవుతారు కాబట్టి.. అది జగన్ పార్టీకి ప్లస్ అవుతుంది.

మీకో ఎగ్జాంపుల్ చెప్పనా.. టీడీపీ, బీజేపీ నేతలు అమరావతిలో, అమరావతిపై మాట్లాడుతుంటే.. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే, ఇతర నేతలు అందరూ జిల్లాల్లో మూడు రాజధానులపై మాట్లాడుతూ లోకల్ ఫీలింగ్ తీసుకొస్తూ పార్టీకి ప్లస్ చేసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో టీడీపీ, బీజేపీ నేతలు బయటకు రావటం లేదు.. మాట్లాడటం లేదు. మాట్లాడుతున్న వారు కూడా జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు.

టోటల్ గా అర్థం అయ్యింది ఏంటంటే.. మరో 15 రోజుల్లో సీఎం జగన్ చేసే ప్రకటనతో టీడీపీ, బీజేపీ మటాష్ అనే టాక్ వైసీపీ పార్టీలో ఇన్నర్ టాక్ గా బలంగా వినిపిస్తోంది.