డబ్బింగ్ మొదలెట్టిన ‘మహర్షి’.

0

‘భరత్ అను నేను’చిత్రం తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు కథానాయకుడి గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రం పై ప్రేక్షకులకు చాలనే అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ చిత్రం గురించి ఒక అప్ డేట్ హల చల్ చేస్తుంది.

ఫిబ్రవరి 7 న ‘మహర్షి’ సినిమా డబ్బింగ్‌ పార్ట్‌ను ప్రారంభించినట్లు చిత్రబృందం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తూ ఫొటోలను విడుదల చేసింది. ఈ సందర్భంగా పూజా కార్యక్రమంలో నిర్మాత దిల్‌రాజు, వంశీ పైడిపల్లి, అల్లరినరేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ పూజ కార్యక్రమానికి మహేశ్‌ హాజరు కాకపోవడం విశేషం. ఈ చిత్రం లో మహేష్ సరసన హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తుంది.

ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన పోస్టర్స్ అని ప్రేక్షకులను బాగా ఆకట్టుకొంటున్నాయి. ఇక డబ్బింగ్ కూడా స్టార్ట్ చేసారు కాబట్టి త్వరలోనే టీజర్ ని కూడా రిలీజ్ చేసే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. .ఈ చిత్రం లో మహేష్ రెండు విభిన్నమయిన గెటప్ లో కనిపించబోతున్నారని టాలీవుడ్ సమాచారం.