ముగిసిన ఇంట‌ర్మీడియట్ ప‌రీక్ష‌లు.

12
End Intermediate Examinations.
End Intermediate Examinations.

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు బుధవారం ముగిశాయి.దీంతో అనేక మంది విద్యార్థులు ఇంటి దారి పట్టారు. వారం రోజుల విరామం తరువాత నుంచి ఎంసెట్‌, జేఈఈ పరీక్షలకు సన్నద్ధం అవుతామని కొందరు విద్యార్థులు తెలిపారు. అయితే గతనెల 28న ప్రారంభమైన పరీక్షలను విజయవంతంగా రాసిన విద్యార్ధులు పరీక్ష ముగిశాక కేంద్రాల బయటికి వచ్చి సందడి చేశారు.

చివరిరోజు జరిగిన కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలకు జిల్లా వ్యాప్తం గా 14,433మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 13, 424మంది హాజరుకాగా 1,009మంది విద్యార్థులు గైర్జారైన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ పరీక్షల్లో 9మంది విద్యార్థులు డిబార్‌కాగా వీరిలో హలియాలో 6 గురు, దామరచర్లలో ముగ్గురు ఉన్నారు.

జిల్లా ఇంట‌ర్ విద్యాధికారి హ‌నుమంత‌రావు న‌ల్గొండ‌లోని ప‌రీక్షా కేంద్రాల‌ను త‌నిఖీలు చేయ‌గా, జిల్లా ప‌రీక్ష‌ల క‌మిటీ స‌భ్యులు జిల్లాలోని మిగ‌తా ప‌రీక్షా కేంద్రాల్లో త‌నిఖీలు నిర్వ‌హించారు. చివ‌ర‌గా పరీక్షలు ముగియడంతో విద్యార్థులు కళాశాలల బయట సందడి చేశారు.కళాశాలల వద్ద విద్యార్థులకు తమ కాలేజీల్లో, కోచింగ్‌ సెంటర్లలో చేరాలంటూ ప్రైవేటు యాజమాన్యాలు కరపత్రాలను పంపణీ చేశారు.

ఏడాది పాటు హ‌స్టల్, కిరాయి గదుల్లో ఉండి చ‌దువుకుంటున్న విద్యార్ధులు ప‌రీక్ష‌లు ముగియ‌డంతో ఆనందంగా ఇంటి బాట ప‌ట్టారు. స్వ‌గ్రామాల‌కు త‌ర‌లి వెళ్లే విద్యార్ధుల‌తో రోడ్ల‌న్నీ ర‌ద్దీగా మారాయి. ఒక‌రికొక‌రు వీడుకోలు చెప్పుకుంటూ ఆనందం, భాద క‌లగ‌ల‌సిన భావాల‌తో ఇంటిబాట ప‌ట్టారు.