టోల్ ప్లాజాల వద్ద బారులు తీరిన వాహనాలు..

0

రెండు తెలుగు రాష్టాలలో పెద్ద ఎత్తున జరుపుకునే పండుగ సంక్రాంతి. ఈ పండుగకు ఎక్కడ ఉన్న వారైనా సరే సొంతూరుకు వెళ్లాల్సిందే. చిన్న పెద్దా తేడా లేకుండా ఆనందంగా జరుపుకునే ఈ పండుగ కోసం హైదరాబాద్ లో నివసించే చాలా మంది ప్రజలు సొంత ఊర్లకు పయనమయ్యారు. దింతో హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్లే రహదారిపై వాహనాలు బారులు తీరాయి. టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. దీనికి తోడు శీతాకాలం కావడంతో పొగ మంచు విపరీతంగా పడుతుంది దింతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడం లేదని వాహనదారులు అంటున్నారు. రోడ్లపై పొగమంచు పడుతుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దింతో వాహనదారు నెమ్మదిగా వెళ్లాలని పొలిసు వారు సూచిస్తున్నారు.