అయోగ్య టీజర్ : విశాల్ “టెంపర్” చూపించాడుగా

0

మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ కథానాయకుడు గా తెరకెక్కిన చిత్రం ‘టెంపర్’. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.రణవీర్ సింగ్ హీరోగా హిందీలో ‘సింబా’పేరుతో రీమేక్ అయ్యి అక్కడ కూడా తన టెంపర్ చూపించింది ఈ సినిమా. అయితే తాజాగా తమిళ హీరో విశాల్ ఈ చిత్రాన్ని ‘అయోగ్య’ పేరుతో తమిళ్ లో రీమేక్ చేస్తున్న విషయం విదితమే. తాజా గా ఈ చిత్ర టీజర్ ని కూడా రిలీజ్ చేసారు చిత్ర యూనిట్ . లైట్ హౌస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో విశాల్, రాశి ఖన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. వెంకట్ మోహన్ దర్శకత్వం వహించారు. పార్థిపన్, కే.యస్.రవికుమార్‌లు ముఖ్యపాత్రలు పోషించారు.