ఏపీకి మూడు రాజధానులు : సీఎం జగన్ సంచలన ప్రకటన

110

ఏపీ అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు సీఎం జగన్. ఏపీ రాష్ట్రానికి మూడు రాజధానులు రావొచ్చని అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. అధికార వికేంద్రీకరణ జరగాలని వెల్లడించారాయన. అభివృద్ధి వికేంద్రీకరణ కూడా జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇది రాష్ట్ర భవిష్యత్ కూడా మంచిదన్నారు.

అమరావతిలో చట్టసభలు ఉంటాయన్నారు. రెండో రాజధానిగా విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ రావొచ్చన్నారు. మరో రాజధానిగా కర్నూలులో హైకోర్టు రావొచ్చని వివరించారు. వారం రోజుల్లో నిపుణుల కమిటీ వస్తుందని.. ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకోవటం జరుగుతుందన్నారు.