బీజేపీలోకి జగన్ పార్టీ ఎమ్మెల్యే ఆనం : ఆపరేషన్ కమలం స్టార్ట్

288
YSRCP Mla Anam Ramanarayana Reddy likely join to BJP

అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేలు జంప్ కావటం చాలా అరుదు. ఏపీలో మాత్రం ఇప్పుడు ఇదే జరుగుతుంది. నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. వెళ్లేటప్పుడు నాలుగు బండలు కూడా వేసి వెళ్దాం అని డిసైడ్అ య్యారు. అందులో భాగంగానే వైసీపీ నెల్లూరు జిల్లా మాఫియా అడ్డా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఈ రేంజ్ లో విరుచుకుపడటం చూస్తుంటే.. ఆపరేషన్ కమలం సక్సెస్ దిశగా వెళుతున్నట్లు స్పష్టం అవుతుంది.

ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న పార్టీ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేయటానికి సిద్ధం అయ్యింది. ఇప్పటికే సీఎం జగన్ కూడా వార్నింగ్ ఇచ్చారు. రొటీన్ గా మారితే కిక్ ఏముందీ అనుకున్నారో ఏమో ఆనం.. వరసగా బండలు వేయటానికే డిసైడ్ అయ్యారు. షోకాజ్ నోటీసులు తీసుకుని మరీ.. రాద్దాంతంగా వెళ్లిపోవటానికి ప్లాన్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

టీడీపీలోకి వెళ్లిన ఉపయోగం లేదు.. భవిష్యత్ కూడా ఉండదని డిసైడ్ అయిన ఈ సీనియర్ నేత.. తన నెక్ట్స్ స్టెప్ ను బీజేపీ వైపు వేస్తున్నారంట. ఇప్పటికే సుజానాచౌదరితోపాటు మరికొందరు కీలక నేతలతో టచ్ లో ఉన్నారంట. తన మాజీ సహచర మంత్రి, స్నేహితుడు అయిన కన్నా లక్ష్మీనారాయణతో చర్చలు కూడా పూర్తి చేసినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల తర్వాత.. ఓ మంచి ముహూర్తంలో బీజేపీ కండువా కప్పుకోవాలని చూస్తున్నారంట. ఓ టీడీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా ఆ పార్టీ ఎమ్మెల్యేలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగేసుకుంటుంటే.. మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ వల వేస్తోంది.

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు – శత్రువులు అనేవారు ఉండరు అని మరోసారి కన్ఫామ్ అయిపోయింది…