ఖచ్చితమైన ఉగాది ఇదే

19

ఉగాది రోజు ఇల్లు శుభ్రం చేసుకుని, ఇంటి ముందు రక రకాల రంగు రంగుల ముగ్గులు వేస్తారు. తలంటు పోసుకుని, మామిడి తోరణాలు, పూల తోరణాలు ఇంటికి కడతారు. ఇంటిల్లిపాది మొత్తం తలంటు స్నానం చేస్తారు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. నూనె లో లక్ష్మి దేవి, నీళ్ళల్లో గంగా దేవి కొలువుంటాయి. అందుకే ముందు గా తలకు నూనె రాసుకుని, తర్వాత తల మీదు గా నీళ్లు పోసుకుని స్నానం చేస్తారు. అలా చేయడం వాళ్ళ లక్ష్మి, గంగా దేవిల అనుగ్రహం ఉంటుందని అంటుంటారు. కొత్త బట్టలు కట్టుకుంటారు. ఆ తరువాత ఉగాది స్పెషల్ ఐన ఉగాది పచ్చడి తో రోజు ని ప్రారంభిస్తారు. సాయంత్రం పూట ఆంధ్రప్రదేశ్ లో ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయితీగా వస్తుంది. వసంతం గురించి రాయని కవి లేడంటే అతిశయోక్తి కాదేమో. అందుకని కవులందరూ తమ కవితా శక్తి ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఒక చోట చేరి వారు రాసిన కవితలు వినిపిస్తూ ఉంటారు. ఈ కలయిక నే కవి సమ్మేళనం అంటారు. ఈ ఫాస్ట్ జనరేషన్ లో కూడా కవి సమ్మేళనాలు జరగడం విశేషం. మనము ఎంత ముందుకు వెళ్తున్నా మూలలను మరచి పోకుండా ఉండడానికి కారణం ఉగాది వంటి పండగలే.