ఉగాది పిండి వంటలు

11

తెలుగు వారి వంటలు సాధారణంగా కారం మరియు మసాలల ఘాటుతో వుంటాయి. కానీ ఉగాది రోజు అలాకాకుండా తీపి పదార్థానికి ప్రాధాన్యత ఇస్తారు. గారెలు, పులిహోర, దద్దోజనం, చక్రపొంగలి ఇలా అన్నీ చేసుకున్నా కూడా ఉగాది పచ్చడి తో మరో ప్రత్యేకమైన వంటకం కూడా ఉంది. అదే బొబ్బట్లు. తెలంగాణా లో వీటినే భక్ష్యాలు అని అంటారు. వీటిని నెయ్యి తో తింటే ఆ రుచే వేరు గా ఉంటుంది. ఉగాది రోజు తెలుగు వారు అస్సలు మాంసాహారానికి ప్రాధాన్యత ఇవ్వరు. శాకాహారమే వండుతారు.