ఉగాది చరిత్ర – ఉగాది ఎందుకు జరుపుకుంటారు

30

సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుంచి వేదాలు దొంగిలించి ఒక సముద్రం లో దాక్కున్నపుడు విష్ణుమూర్తి మత్స్య అవతారం ధరించి ఆ రాక్షసుణ్ణి సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మ వద్దకు చేర్చాడని, ఆ రోజు చైత్ర శుద్ధ పాడ్యమి అని, ఆ రోజునే వేదాల సహాయంతో బ్రహ్మ సృష్టి ని చేయడం మొదలు పెట్టాడని అందుకే ఆ రోజుని యుగాది అంటారని తెలుగు వారి నమ్మకం. ఈ యుగాది యే కాలక్రమేణా ఉగాది గా మారింది. చైత్ర శుద్ధ పాడ్యమి వసంత కాలం రావడానికి సూచిక. పూర్వ కాలం లో కూడా ఈ రోజు ని పవిత్రంగా భావించే వారు.  తెలంగాణా ,ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక ల్లో చాంద్రమానాన్ని అనుసరించి ఉగాది ని జరుపుకుంటారు. తమిళనాడు, మహారాష్ట్ర ,పంజాబ్, కేరళ,అస్సామ్ రాష్ట్రాలలో సౌర మానాన్ని కూడా జరుపుకుంటారు. పంజాబ్ లో వైశాఖి గా మహారాష్ట్ర లో గుడి పదవ గా , అస్సామ్ లో విహు గా , కేరళ లో పొళ్ళవర్షం గా, తమిళనాడు లో పుత్తాండి గ ప్రసిద్ధి.